భారీగా తగ్గిన పసిడి ధరలు
బంగారం ధరలు ఢమాల్.. హైదరాబాద్లో నేటి రేట్లు ఇవే
హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి అదిరిపోయే Update. హైదరాబాద్ Bullion Marketలో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,570 తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లలో మార్పులు వంటి అంశాలు Gold ధరలపై ప్రభావం చూపుతుంటాయి. తాజా ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,570 తగ్గి రూ.1,30,690కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.2,350 పడిపోయి రూ.1,19,800 వద్ద కొనసాగుతోంది. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న Gold Buyersకు ఈ తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
అటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. కిలో Silverపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,80,000 వద్ద ట్రేడవుతోంది. అయితే ప్రాంతాలను బట్టి Gold, Silver ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుత ధరలతో పాటు 3 శాతం GST అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాల కొనుగోలుపై Making Charges కూడా వర్తిస్తాయి. ధరలు మరింత తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అన్నది రానున్న రోజుల్లో మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.