కుదిపేసిన విషాదం.. బావిలో ఐదుగురు
తమిళనాడులో విషాదం.. వ్యవసాయ బావిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!
కరూర్ : తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వంగల్ సమీపంలోని చిన్నకాళిపాళయం గ్రామంలో బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను రామస్వామి (63), ఆయన భార్య జానకి (60), కుమార్తె సుగుణ (35), మనవరాలు శివాని (10), మనవడు అధిరన్ (4)గా పోలీసులు గుర్తించారు. పొలంలోని బావిలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వంగల్ పోలీసులు, Fire Department సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం Postmortem కోసం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో సుగుణకు భర్తతో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ కుటుంబ సమస్యలకు ఘటనకు సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురి మరణాలకు సంబంధించి పలు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, వాటిపై అధికారిక నిర్ధారణ లేదు. ప్రస్తుతం అసహజ మరణాలుగా కేసు నమోదు చేసిన పోలీసులు, Postmortem Report ఆధారంగా మరణాలకు గల అసలు కారణాలను నిర్ధారించనున్నారు.