సిద్దిపేటకు సీఎం రేవంత్
సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.544 కోట్ల పనులకు శ్రీకారం!
హైదరాబాద్: సిద్దిపేట జిల్లాపై అభివృద్ధి వరాల జల్లు కురిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Siddipet Tour) సిద్ధమయ్యారు. నేడు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. పథకానికి సంబంధించిన Application Formను కూడా విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది.
మరోవైపు జిల్లాలో మౌలిక సదుపాయాలు, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మొత్తం రూ.544.11 కోట్ల విలువైన Development Worksకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సిద్దిపేటలోనూ మరో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు పునాది వేయనున్నారు. ఒకవైపు పేద కుటుంబాలకు Insurance Security కల్పించే ఇందిరమ్మ బీమా.. మరోవైపు విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందించే Young India Residential Schools.. ఇలా సంక్షేమం, విద్య, అభివృద్ధి లక్ష్యంగా సీఎం పర్యటన సాగనుంది. ఈ కార్యక్రమాలతో సిద్దిపేట జిల్లాలో కొత్త అభివృద్ధి పనులకు ఊతం లభించనుంది.