స్టాక్ మార్కెట్‌కు మళ్లీ షాక్
ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన సెన్సెక్స్!
ముంబై, నవంబర్ 19: దేశీయ Stock Marketలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అమెరికా Federal Reserve వడ్డీ రేట్లను మరోసారి పెంచవచ్చన్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో కీలక సూచీలు Sensex, Nifty ప్రారంభ ట్రేడింగ్‌లోనే దిగజారాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 30 షేర్ల BSE Sensex 206.12 పాయింట్లు నష్టపోయి 81,837.27 వద్దకు చేరింది. మరోవైపు 50 షేర్ల NSE Nifty కూడా 78.10 పాయింట్లు పడిపోయి 25,145.70 వద్ద ట్రేడయింది.
అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, అమెరికా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. Infosys, HCL Technologies, Tech Mahindra, Tata Consultancy Services (TCS) షేర్లు నష్టాల్లో కొనసాగాయి. వీటితో పాటు Eternal, ICICI Bank షేర్లు కూడా Sensexలో ప్రధానంగా నష్టాలను నమోదు చేశాయి. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.