ఎయిర్‌పోర్టులో అనూహ్య ఘటన.. (షాకింగ్ వీడియో)

19-11-2026 | 08:36am

టికెట్ లేదు.. డాక్యుమెంట్లు లేవు.. అయినా టెర్మినల్‌లోకి చొరబాటు యత్నం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport)లో భద్రతా సిబ్బందికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. సరైన Travel Documents లేకుండానే Terminal-3లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న Central Industrial Security Force (CISF) సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో అతడి ప్రయత్నం విఫలమైంది.

Terminal-3 Departure Gate వద్ద ఓ వ్యక్తి అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు CISF సిబ్బంది గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది.. Quick Response Team (QRT) సహాయంతో అతడిని అడ్డుకున్నారు. చొరబాటు ప్రయత్నాన్ని గుర్తించిన కొన్ని సెకన్లలోనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాశ్రయంలో తలెత్తే అవకాశం ఉన్న Security Breachను ముందుగానే నివారించారు.

ఈ ఘటనపై CISF సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వివరాలు వెల్లడించింది. సిబ్బంది అప్రమత్తత, వేగవంతమైన స్పందనతో అనధికార ప్రవేశాన్ని అడ్డుకున్నట్లు తెలిపింది. ఎయిర్‌పోర్టు భద్రత విషయంలో తమ సిబ్బంది ఎప్పుడూ Vigilantగా ఉంటారని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై Legal Proceedings కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


మరిన్ని వార్తలు