తగ్గిన పసిడి ధరలు

25-11-2026 | 11:34am

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చే వార్త. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. బంగారం ధరల్లో(Gold Price) భారీ తగ్గుదల నమోదవగా.. వెండి కూడా అదే బాటలో పయనించింది. తాజా ధరల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.3,220 తగ్గడంతో ధర రూ.1,24,580కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.2,950 తగ్గి రూ.1,14,200గా నమోదైంది. మరోవైపు వెండి ధర(Silver Price) కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గడంతో ధర రూ.1.65 లక్షలకు చేరింది. వరుసగా తగ్గుతున్న ధరలు పసిడి, వెండి కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయి.

మరిన్ని వార్తలు