ప్రభుత్వ భూముల వేలంపై అఖిలపక్షం సమరం

25-11-2026 | 07:35am

హైదరాబాద్: ప్రభుత్వ భూముల(Government Lands) విక్రయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆందోళనకు సిద్ధమైంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూముల ఈ-వేలాన్ని(HMDA e-auction) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. కేపీహెచ్‌బీ, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ ప్రాంతాల్లోని భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నెల 27న నిర్వహించనున్న ఈ-వేలం ప్రక్రియను నిలిపివేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొననున్నారు. ప్రభుత్వ భూములను విక్రయించకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని వారు కోరుతున్నారు. భూముల వేలం అంశంపై అఖిలపక్షం చేపట్టనున్న ముట్టడి కార్యక్రమంతో హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.

మరిన్ని వార్తలు