రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి

25-11-2026 | 05:25am

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ దంపతులు

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నివాసం (ఎర్రవల్లి ఫామ్‌హౌసఖ్)లో  ఎంతో నమ్మకం గా, అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి(Kasturi Mahender Reddy) అలియాస్ మణికుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో(Road accident) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలియగానే కేసీఆర్ దంపతులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద ఈ ఘోరం జరిగింది. రాత్రి వేళ మణికుమార్, మరో యువకుడు భరత్ కలిసి బైక్‌పై వెళ్తుండగా వెంకయ్యకుంట వద్ద ఓ ఇసుక లారీ వీరిని బలంగా ఢీకొట్టడంతో మణికుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భరత్ కూడా మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే కేసీఆర్ వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మణి తమ కుటుం బంలో ఒకడిగా కలిసిపోయాడని, ఆయన లేని లోటు తీరనిదని కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కేటీఆర్, శైలిమ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేసీఆర్, దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్, శరత్ రావులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు