స్టాక్స్‌లో స్వల్ప నష్టాలు

11-09-2026 | 04:43pm

ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market) సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్నాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్‌ దాదాపు 620 పాయింట్లు రికవరీ అయ్యింది. చివరికి 120.83 పాయింట్లు నష్టపోయి 74,781.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79.70 పాయింట్లు కోల్పోయి 23,398 వద్ద ముగిసింది. రూపాయి విలువ డాలర్‌కు రూ.95.57గా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 103 డాలర్ల వద్ద కొనసాగింది.

మరిన్ని వార్తలు