స్టాక్ మార్కెట్లకు బిగ్ షాక్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Market) భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయంగా వడ్డీ రేట్లు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల(Crude oil prices) ప్రభావం మార్కెట్లపై కనిపించింది. సెన్సెక్స్ ఏకంగా 1,045 పాయింట్లు కోల్పోయి 71,593 వద్ద ముగియగా, మరోవైపు నిఫ్టీ 371 పాయింట్లు పతనమై 22,231 వద్ద స్థిరపడింది.
ఈ పతనంతో నిఫ్టీ 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ఆర్బీఐ వడ్డీ రేటు(RBI interest rate) పెంపు ప్రభావంతో పాటు క్రూడ్ ఆయిల్ ధరల కదలికలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కీలక సూచీలు భారీగా పడిపోవడంతో మార్కెట్ వర్గాలు తదుపరి పరిణామాలపై దృష్టి సారించాయి.