సర్వేంద్రియానం.. నయనం ప్రధానం
వరల్డ్ సైట్ డే సందర్భంగా కంటి ఆరోగ్యం పై అవగాహన
జవహర్ నగర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): సర్వేంద్రియానాం నయనం ప్రధానమని కంటి ఆరోగ్యమే, మానవుని ముఖ్య కర్తవ్యమని మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (Malkajgiri Municipal Corporation)పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో వరల్డ్ సైట్ డే సందర్భంగా మ్యాక్సీవిజన్ కంటి ఆసుపత్రి ప్రతినిధుల ఆధ్వర్యంలో కంటి ఆరోగ్యం పై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో" ఐ ప్లేడ్జి టు ప్రొటెక్ట్ మై విజన్" అనే స్లోగన్ తో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సకల జలచర రాశులలో కంటి ఆరోగ్యమే ప్రధానమని కండ్లు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. శరీరంలోని సున్నితమైన పంచంద్రియాలలో ఒకటైన కండ్లు ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మ్యాక్సీవిజన్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.