స్క్రాప్ తొలగింపుతో పరిశుభ్రమైన, సురక్షితమైన వర్క్‌షాప్

08-10-2026 | 07:09pm

ఇల్లెందు, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా వర్క్‌షాప్‌లో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్-6లో(Swachhata Special Campaign-6) భాగంగా స్క్రాప్ తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎన్విరాన్‌మెంట్ అధికారి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రామదాసు, డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారాం పాల్గొన్నారు.

వర్క్‌షాప్‌లో పేరుకుపోయిన పనికిరాని మిషన్లు, ఫ్యాన్లు, లైట్లు, మోటార్లు తదితర స్క్రాప్‌ను గుర్తించి స్క్రాప్ యార్డుకు తరలించారు. అనంతరం ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారు. స్క్రాప్‌ను ఎక్కువకాలం నిల్వ ఉంచితే ప్రమాదాలతో పాటు విషజంతువులు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఎప్పటికప్పుడు స్క్రాప్‌ను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ డీజీఎం నాగరాజు నాయక్, దేవేందర్ నాయక్, యుగంధర్, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు