హైదరాబాద్‌లో ఇండియా లీడర్షిప్ సమ్మిట్ మూడవ ఎడిషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 12, 2026: పరిశ్రమ నియమాలు మారుతున్న వేళ, నాయకత్వం వహించడానికి ఏమి కావాలి? ఒక ఫంక్షనల్ నిపుణుడు ఎంటర్ప్రైజ్ లీడర్‌గా ఎలా ఎదుగుతాడు? ప్రపంచ హెల్త్‌కేర్ వ్యాపారాలు రూపుదిద్దుకునే, నడిపించే కేంద్రంగా ఇండియా ఎదుగుతున్న నేపథ్యంలో... దిశానిర్దేశం చేసే స్థాయిలో భారతీయ నిపుణులు సిద్ధంగా ఉన్నారా? హైదరాబాద్‌లో జరిగిన హెల్త్‌కేర్ బిజినెస్విమెన్స్ అసోసియేషన్ (Healthcare Businesswomen’s Association) ఇండియా యొక్క మూడవ ఇండియా లీడర్షిప్ సమ్మిట్ (ఐఎల్ఎస్) 2026కు ఈ ప్రశ్నలే నేపథ్యంగా నిలిచాయి.
ఆరోగ్య సంరక్షణ, జీవశాస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, సిఆర్ఓలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జిసిసి లు) నుండి వందలాది మంది సీనియర్, వర్ధమాన నిపుణులను ఒకచోట చేర్చిన ఈ సదస్సు, “మార్పును నడిపించండి: ఏఐ & గ్లోబల్ కెపాబిలిటీ యుగంలో ప్రభావవంతమైన నాయకత్వం” అనే ఇతివృత్తంతో జరిగింది.ఇండియా లీడర్షిప్ సమ్మిట్ 2026 యొక్క ముఖ్య ఉద్దేశ్యం 'చేస్తూ నేర్చుకోవడం'. మొదటి రోజు ఆమ్జెన్ ఇండియాలో నాలుగు మాస్టర్‌క్లాస్‌లు జరిగాయి.
నోవార్టిస్ ఇండియా కంట్రీ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ దూబే, మార్పు మరియు అనిశ్చితిని నాయకత్వ అవకాశంగా మార్చుకోవడంపై ఒక కీలకోపన్యాసం చేయటంతో రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, జాన్సన్ & జాన్సన్, జెడ్ఎస్ అసోసియేట్స్, నోవార్టిస్, ఇతర ప్రముఖ సంస్థల నాయకులు ఒత్తిడిలో నాయకత్వం వహించడం, తమను తాము పునఃసృష్టించుకోవడం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హెల్త్‌కేర్ బిజినెస్విమెన్స్ అసోసియేషన్ సీఈఓ మేరీ స్టట్స్ మాట్లాడుతూ: “హెచ్‌బిఏ ప్రపంచవ్యాప్త వృద్ధి ప్రస్థానంలోనూ, అలాగే మా కార్పొరేట్ భాగస్వాముల వృద్ధిలోనూ భారతదేశం ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంరక్షణ, జీవశాస్త్ర రంగాలలో భారతదేశ పాత్ర పెరుగుతూనే ఉన్నందున, భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులకు మద్దతు ఇవ్వడం , వారిని ప్రోత్సహించడం హెచ్బిఏకు గర్వకారణం అన్నారు. హెచ్‌బిఏ గ్లోబల్ బోర్డ్ డైరెక్టర్, డి క్యూబ్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకురాలు & సీఈఓ డాక్టర్ దీపా దేశాయ్ మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా హెచ్‌బిఏ యొక్క అత్యంత చైతన్యవంతమైన నాయకత్వ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా హెచ్‌బిఏ ఇండియా ఎదిగింది. ఒక నాయకత్వ నిర్ణయం దానిని తీసుకున్న వ్యక్తిని దాటి చాలా దూరం వరకు ప్రభావాన్ని సృష్టించగలదనే ఆలోచన అయిన “ది రిపుల్ ఎఫెక్ట్” పై దృష్టి సారించడంతో ఈ సదస్సు ముగిసింది.