అపర సంజీవుడు.. ఈ బసవానందుడు

13-09-2026 | 05:20am

35 ఏండ్లుగా ప్రజలకు హోమియో వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్

హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): నేటి సమాజంలో మారుతున్న కా లానికి అనుగుణంగా మానవుని శరీరం అనేక మార్పులు చోటు చేసుకుంటుంది. ఆహార నియమాలు పూర్తిగా అదుపుతప్పడంతో అతి చిన్న వయసులోనే భయంకర మైన వ్యాధులు (Diseases) చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వేలకు వేలు పోసి ఎలాగైనా తమ రోగాన్ని నయం చేసుకోవాలని బాధితులు అనేక ఆస్పత్రుల (Hospitals) చుట్టూ తిరుగుతుం టారు.

అటువంటి వారికి అపర సంజీవం హోమియోపతి వైద్యంగా మారింది. ఎంతటి మొండి రోగానైనా ఈ వైద్యంతో నయం చే స్తున్నారు.1991 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 బ్రాంచ్ ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో చిక్కడపల్లిలో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పేరున హోమియోపతి వైద్యులు దండేపు బసవానందం వైద్యశాలను ప్రారంభించా రు. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 35 ఏండ్లుగా నిరంతరం ప్రజలకు వైద్యం అందిస్తూ తన ఖ్యాతిని పెంచుకుంటున్నాడు.

డాక్టర్లు సైతం చేతులెత్తేసే అటువంటి భయంకరమైన మొండి రోగాలను సైతం తన హో మియోపతి వైద్యంతో క్రమంగా మెరుగుపరుస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కిడ్నీ డయాలసిస్, కాలేయం, గుండె మొదలగు చర్మ సంబంధిత సమస్యల కు అతి తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్యం అందిస్తు న్నారు. ప్రజలకు హోమియోపతి వైద్యంపై అవగాహన లేక ఇంగ్లీష్ మందులు వాడు తూ ఇతర వైద్య విధానా లతో విసిగివేసారి పోయారు.

అటు ఆర్థికంగా మానసి కంగా కృంగి కృషించిపోతున్నారు. అటువంటి వా రికి అపర సంజీవిగా తన వైద్యాన్ని పరిచయం చేస్తూ ఎంతోమంది బాధితుల ము ఖంలో చిరునవ్వును తిరిగి తీసుకువస్తూ వారి మన్ననలు పొందుతున్నారు.

దండేపు బసవానందం చిక్కడపల్లి లోని తన వైద్యశాలకు వేల సంఖ్యలో జనం వస్తు క్షణం తీరిక లేకున్నా వారికి వైద్యం అందిస్తున్నారు. మొ దటగా బాధితులను ప్రేమగా ఆప్యా యంగా పలకరించడం ఆయన ప్రత్యేకత ప్రేమ ఆ ప్యాయతలతోనే బాధితులకు సగం రోగం న యమైతుందని నమ్మి తన నమ్మకాన్ని ప్రజ ల నమ్మకంగా మార్చు కున్నాడు.

చిక్కడపల్లిలోని ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కు బాధి తుల తాకిడి పెరగడంతో అదే ప్రాంతంలో సకల వసతులతో నూతన హోమియోపతి వైద్యశాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై ప్రారంభించారు. హోమియోపతి వైద్య విధా న స్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శా మ్యూల్ హానిమన్ సేవలు మరువలేనివని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆయన వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నారు దండేపు బసవానందం.

మరిన్ని వార్తలు