ఆస్తి కోసం వేధింపులు.. అభాగ్యురాలి ఆత్మహత్య

10-11-2026 | 09:38am

కరీంనగర్‌: జిల్లాలోని కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరికుల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు భరించలేక స్రవంతి (35) అనే వివాహిత సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల క్రితం స్రవంతికి కొత్తూరి సంపత్‌తో వివాహమైంది. గత ఆరు నెలలుగా తన తండ్రికి చెందిన ప్లాటును విక్రయించి, ఆ డబ్బులు ఇవ్వాలంటూ భర్త సంపత్‌ ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయమై తరచూ వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

భర్త వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంపత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సీఐ నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు