జీరో దందాలో ధాన్యం.. రెండు లారీలు పట్టివేత

10-11-2026 | 10:11am

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి కేసముద్రం మండల సరిహద్దులోని ఓ రైస్ మిల్లుకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యాన్ని కేసముద్రం మార్కెట్ చెక్‌పోస్టు సిబ్బంది మంగళవారం ఉదయం పట్టుకున్నారు. కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రెండు డీసీఎం లారీలను (DCM Trucks) అడ్డుకుని తనిఖీ చేశారు.

ఒక్కో లారీలో రూ.2 లక్షలకు పైగా విలువైన ధాన్యం (Paddy Stock) ఉన్నట్లు గుర్తించారు. ధాన్యం రవాణాకు సంబంధించి ఎలాంటి ఎగుమతి పత్రాలు (Transport Documents) లేకపోవడంతో మార్కెట్ ఫీజు (Market Fee) చెల్లించాలని సిబ్బంది లారీలను నిలిపివేశారు. ఈ క్రమంలో డ్రైవర్లు తనిఖీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది

మరిన్ని వార్తలు