పోలీసుల ఉక్కుపాదం
9,600 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం,
30 లీటర్ల గుడుంబా స్వాధీనం,
ముగ్గురు వ్యక్తులు అదుపులో, వెంకటాపురం,
నూగూరు,నవంబర్ 9 (విజయక్రాంతి): నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలపై(Police Raid Gudumba Manufacturing Units) ఉక్కుపాదం మోపుతూ, సోమవారం ఉదయం సీఐ ముత్యం రమేష్ నేతృత్వంలో, వెంకటాపురం,మండలంలో రామచంద్రపురం గ్రామ శివారులోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 48 డ్రమ్ములలోని సుమారు 9,600 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేయడంతో పాటు, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.