రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కూసుమంచి, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో కూసుమంచి మండలం కు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం అర్థరాత్రి నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలం, మల్లాయిగూడెం గ్రామపంచాయతీ శివారు హట్యతండా కు చెందిన మంగళవారం అర్థరాత్రి గుగులోతు సురేష్(27) ట్రాక్టర్ పై ప్రయాణిస్తుండగా ఖమ్మం సూర్యాపేట హైవే రోడ్డుపై( Khammam-Suryapet Highway) జుజ్జులరావుపేట గ్రామంలోని అన్నపూర్ణ దాబా హోటల్ సమీపాన ట్రాక్టర్ ను డీసీఎం ఢీ కొట్టింది. దీంతో గుగులోతు సురేష్ ( 27 ) అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కూసుమంచి పోలీసులు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శవపరీక్ష కేంద్రానికి తరలించారు.