నేడు అఖిలపక్షం భేటీ
- డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం
- ఎల్ నినో పరిస్థితులు, కరువుపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్27(విజయక్రాంతి): రాష్ర్టంలో ఎల్ నినో ప్రభావం(El Nino effects), వర్షపాతం లోటుతో తలెత్తే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన బుధవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం(All-party meeting) నిర్వహించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది.
ఎల్ నినో కారణంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకోబోయే ముందస్తు చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే తాగు, సాగు నీరు, విద్యుత్ సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, ప్రత్యామ్నా య పంటల ప్రణాళిక వంటి కీలక అంశాలపై రాజకీయ పార్టీల నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. కరువు నివారణకు అనుసరించాల్సిన వ్యూహం, ముందస్తు చర్యలపై వారి అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది.