సిరి ఉంటే సరిపోదు

28-10-2026 | 05:10am

రాజకీయానికి ’సంస్కారం’ ఉండాలి!

ఫౌండేషన్లు, ధన బలంతో ఎదగాలనుకునే కొత్త నేతలకు కల్వకుర్తి చరిత్ర ఇస్తున్న హెచ్చరిక

సేవా ముసుగులో రాజకీయం..

‘అవేరు’ అనుభవ పాఠం 

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఆడంబరాలు, అర్థబలం, ఆత్మస్తుతి మాత్రమే ఉంటే రాజకీయంలో(Politics) నెగ్గుకురావచ్చనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడాలంటే ఓర్పు, నేర్పు, తెగింపుతో పాటు కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే నిబద్ధత అత్యంత ముఖ్యం. కానీ, నేటి రోజుల్లో రాజకీయాన్ని కొందరు ’ఇన్స్టంట్ సక్సెస్’గా భావించే ధోరణి పెరిగిపోతోంది. స్వచ్ఛంద సేవా సంస్థలు(Voluntary Service Organizations), ఫౌండేషన్ల పేరిట పుట్టగొడుగుల్లా కొత్త నేతలు పుట్టుకొస్తున్నారు. డబ్బు తో ప్రజాభిమానాన్ని కొనేయవచ్చని, తోటివారిని చులకన చేస్తూ అహంకారంతో ముం దడుగు వేయవచ్చని భావిస్తున్న వారికి చరి త్ర తరచూ కనువిప్పు కల్గిస్తూనే ఉంది.

రూపాయి చందా.....

ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజల కోసం చేసే త్యాగం. అప్పట్లో నాయకులు త మ ఆస్తులను కాపాడుకుంటూనే, ప్రజల నమ్మకాన్ని సంపాదించి రాజకీయాల్లోకి వ చ్చేవారు. కార్యకర్తలే నాయకుడికి(leader) అసలైన ఆ స్తిగా ఉండేవేవారు. తను గెలిస్తే తమ కష్టాలు తీరుస్తాడనే నమ్మకంతో, పేద ప్రజలే స్వచ్ఛందంగా చందాలు పోగు చేసి, పది, ఇరవై రూ పాయలు వేసి నాయకులను గెలిపించిన ప విత్రమైన రోజులు ఉండేవి. ప్రజాస్వామ్యం అంటే అర్ధబలం కాదని, అది పూర్తిగా ఆత్మబలమని నాడు మన పెద్దలు నిరూ పించారు.

‘అవేరు’ అనుభవ పాఠం.....

సేవ అనేది స్వచ్ఛంగా హృదయం నుండి రావాలి కానీ, కేవలం ఎన్నికల్లో టికెట్ సా ధించడానికో, అధికారం చేపట్టడానికో ఉపయోగించే ’ముసుగు’ కాకూడదు. డబ్బు, అ హంకారంతో రాజకీయం చేయాలనుకుని బోల్తా పడ్డ సంఘటనలకు మన తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అనేక బలమైన ఉదాహరణలు ఉన్నాయి. గతంలో కల్వకుర్తి ని యోజకవర్గంలో ఇలాంటి ఘటనే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ’అవేరు’ అనే స్వచ్ఛంద సంస్థ పేరిట రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఒక నాయకుడు, సంక్షేమ కార్యక్ర మాల పేరుతో కోట్లాది రూపాయలు వెదజల్లారు.

నాడే తానే ఎమ్మెల్యేనని, తనకు మిం చిన నాయకుడే లేడంటూ ఊహల్లో తేలియాడారు. అంతటి ధనబలాన్ని ప్రదర్శించి నప్పటికీ, కల్వకుర్తి ప్రజలు ఆయన వ్యాపార రాజకీయాలను, తాత్కాలిక హడావుడిని తీవ్రంగా తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు లభించిన పరాభవం, ‘డబ్బులతో ప్రజాభిమానాన్ని ఎప్పటికీ కొనలేరు‘ అనడానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.1994లోనూ ‘ఆవేరు’ సంస్థల ఛైర్మన్గా ఉన్న  మాధవన్ జి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

ఆ వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, కల్వకుర్తి ప్రజలు మాత్రం డబ్బు రాజకీయాలను తిప్పికొడుతూ ఆయనకు మద్దతు నిరాకరించారు. కోట్ల నిధులను నీళ్లలా ఖర్చు చేసినా... ప్రజల రాజకీయ చైతన్యం ముందు ఆ ధన బలం నిలవలేకపోయింది.

తాత్కాలిక హడావుడి.. శాశ్వత పతనం......

నేటి కాలంలోనూ చాలామంది కొత్త నేతలు అవే పాత పొరపాట్లను పునరావృతం చేస్తున్నారు. డబ్బు ధర్పంతోఅ హంకారం - చులకన భావం ప్రదర్శిస్తున్నారు.. కొందరు కొత్త నేతలు. తోటి నాయకులను, తమకంటే ముందు నుంచి పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలను డిగ్రేడ్ చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడటమే తమ గొప్పతనంగా భ్రమపడుతున్నారు. ప్రజల ఆమోదం పూర్తిగా పొందకుండానే, నేరుగా టికెట్లు తమవేనంటూ నియోజకవర్గాల్లో ముందస్తు హడావుడి చేస్తున్నారు. డబ్బును గుమ్మరిస్తే ప్రజలు ఓట్లేస్తారని, సిద్ధాంతం కంటే ప్రచారమే ముఖ్యమని పొరబడుతున్నారు.

చరిత్ర చెప్పే సత్యం ఇదే!

రాజకీయాల్లో ఇన్స్టంట్ సక్సెస్ అనేది ఉండదు. ఒకవేళ తాత్కాలికంగా మెరుపులు మెరిపించినా, విలువల పునాది లేని రాజకీయ ప్రయాణం ఎక్కువ కాలం నిలబడదు. నాయకుడిపై ప్రజలకు ఉండే నమ్మకం, పార్టీ పట్ల క్రమశిక్షణ, కార్యకర్తల పట్ల ఉండే ఆత్మీయత ఉన్నవారే నిజమైన ప్రజాదరణ పొందుతారు. నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చి సేవ పేరిట హంగామా చేస్తున్న నేతలు, ఒక్కసారి చరిత్ర పుటల్లోని ఈ గుణపాఠాలను చదువుకుంటే వారి రాజకీయ భవిష్యత్తుకైనా, వారు ప్రాతినిధ్యం వహించే సమాజానికైనా ఎంతో మంచిది.

డబ్బుతో రాజకీయాలను శాసించవచ్చనే భ్రమలకు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ సరైన రీతిలో చెక్ పెడుతూనే ఉంటారు. రాజకీయాల్లో ఏళ్ల చరిత్ర, కోట్ల రూపాయల ఖర్చు ఎప్పుడూ ప్రజల చైతన్యవంతమైన తీర్పును మార్చలేవని ఈ చారిత్రక సంఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు