ఆహార భద్రత అవసరం

16-10-2026 | 05:05am

ఎల్ నినో తాండవిస్తున్న వేళ ప్రపంచ ఆహార దినోత్సవం(World Food Day) జరుపుకుంటున్న సందర్భంగా అనేక విషయాలు పరి శీలిస్తే ప్రపంచ జనాభా అంతటికీ ఆకలి కేకలు లేకుండా చేయగలమా? అనే ప్రశ్న వేధిస్తుంది. ఈ అసలు విషయం మరచి, చాలా దేశాధినేతలు తమ ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ఇతర దేశాలపై అకారణంగా యుద్ధాలు, దాడులకు దిగడం, చ మురు నిల్వలు ఆక్రమించుకోవడం, వివిధ దేశాధినేతలను నిర్బంధించడం, నియంత్రించడం, మరికొన్ని దేశాలపై అధిక సుం కాలు విధించడం ఇలా పలు సమస్యలు సృష్టిస్తూ ఉన్న సమస్యలను మరింత జఠి లం చేయడం ద్వారా దాదాపు ప్రతీ దేశం లో గందరగోళం నెలకొంది.

దీనికి కార ణం ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశం మరో దేశంపై అనేక విషయాల్లో ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. ఎక్కడైనా సమస్య లు ఏర్పడితే దాని ప్రభావం దాదాపు ప్రతీ దేశంపై పడుతుంది. ముఖ్యంగా‘ సప్లై చైన్‘ దెబ్బతింటుంది. ఈ దశాబ్దం కాలంలోనే ‘కరోనా‘ విలయతాండవం చేయడం, తదుపరి ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా గాజాపై దండయాత్ర, నేటికీ కొనసాగుతున్న రష్యా  యుద్ధం, అమెరికా ఘైఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టివేసింది.

సరికదా మరోపక్క వాతావరణ మార్పులు మొత్తం ప్రపంచాన్ని ముఖ్యంగా ఆహారపు గొలుసును దెబ్బతీస్తుంది. ఇంకోవైపు ‘ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)’ రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూ పుతోంది. రోజూ అనేక కంపెనీల్లో వేలకొలదీ ఉద్యోగాలు ‘లే ఆఫ్’ అవుతూ మానవ జీవనోపాధిని దెబ్బతీస్తోంది. మనదేశంలో 1990 నుంచి సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తరువాత ప్రతీ రంగం ప్రైవేటీకరణ వల్ల జీవన పరిస్థితులు ధీనం గా మారాయి. వ్యవసాయరంగం పలు సమస్యలు ఎదుర్కుంటోంది. ఆహారధాన్యాల ధరలు కొండెక్కి, ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్య ప్రజలకు కనీసం మూ డు పూటలా తిండి లేని పరిస్థితి ఏర్పడుతోంది. సరికదా ఒక శాతం జనాభా కలి గిన సంపన్నుల వద్ద దాదాపు నలభై శాతం సంపద పోగుపడడం జరిగింది.

ఇదే దేశాభివృద్ధి అని పాలకులు మురిసిపోతున్నారు. తాజాగా 7.5 శాతం జీడీపీ వృద్ధి సాధించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో దాదాపు నూటికి ఎనభై శాతం జనాభా, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత బియ్యం, పెన్షన్ లపై ఆధారపడి జీవిస్తున్న వైనం మర్చిపోవడం గమనార్హం. రోజూ దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, విద్యార్థులు, యువత రకరకాల సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆహార దినోత్సవం జరు పుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలు విశ్లేషణ చేద్దాం.

ఇటలీ రాజు ‘విక్టర్ ఇమ్మాన్యుయేల్ -3’ 1905లో ప్రపంచ దేశాలతో ‘రోమ్’లో సమావేశం నిర్వహించి ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఐఏ)’ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్త వ్యవసాయ డేటాను 1930లో ప్రచురించింది. అయితే రెండో ప్రపంచయుద్ధ సమ యంలో ఈ సంస్థ బలహీన పడుటచే, అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్, ఆస్ట్రేలి యా ఆర్థిక శాస్త్రవేత్త ఎఫ్‌ఎల్ మెక్‌డొగెల్ ప్రయత్నాల మూలంగా అక్టోబర్ 16, 1945లో ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటు చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత తీర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎఫ్‌ఏఓ ఆవిర్భావ దినోత్సవాన్నే 1979 నుంచి ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ము ఖ్యంగా వ్యవసాయం, ఫిషరీస్, అడవులు, నీటి పారుదల సౌకర్యాలు, భూమిని సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ‘ఇన్నోవేట్ టుడే, నరిష్ టుమారో’ అనే థీమ్‌తో జరుపుతున్నారు.

ఇక మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వాలు, పాలకులు, పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం, నీలి విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్ వంటి కార్యక్రమాత ద్వారా ఈరోజు మన అందరికీ ఆహర భధ్రత సమకూరుతోంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇతర దేశాలకు కూడా ఆహర ధాన్యాలు ఎగుమతి చేయగలుగుతు న్నారు. ఆహార భధ్రత చట్టం, ఉపాధి హామీ పథకం వంటి అంశాలు దేశంలో ఆహార కొరత అరికట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. అయినప్పటికీ భార త్‌లో అందరికీ ఆహారం అందడం లేదు. సరికదా పోషకాహారం లోపం గమనించదగిన అంశం..

ఇటీవల ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలో వెలువడిన ‘ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్’ 2026 తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 64.5 కోట్ల మందికి ఆహారం లేదు. 269 కోట్ల మందికి న్యూట్రిషన్ ఫుడ్ లేదు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాలు ఎక్కువగా ఆహారం లేక బాధపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఆఫ్రికా లో 30.9 కోట్ల మంది, ఆసియాలో 29.2 కోట్ల మం ది ఆహార సమస్యలతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆఫ్రికాలో సుమారు 56శాతం మంది పోషకాహారం లేకుండా ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే మనదేశం ఆకలి కేకల్లో (హంగర్ ఇండెక్స్) 102వ స్థానంలో నిలిచింది. పేదరికం 11.28 శాతంతో అలమటిస్తున్నది. సంతోష సూచీలో మనది 118వ స్థానం, ఆరోగ్య సూచీలో 45వ ర్యాంకు. ఇలా పలు విధాలా మనం వెనుకబడి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నా, మనదేశం త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా, 500 ట్రిలియన్ డాలర్లు వ్యవస్థగా నిలవబోతుందని సంబరం పడటం తగునా? ఇకనైనా దేశాభివృద్ధి అంటే పేద, సామా న్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అందరికీ ఆహారం, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందాలి.

వ్యాసకర్త సెల్: 9390509791

ఐ.ప్రసాదరావు

మరిన్ని వార్తలు