మోడల్ టీచర్లపై నిర్లక్ష్యమా?
రాష్ర్టంలోని మోడల్ స్కూళ్ల టీచర్లు(Model School Teachers) తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం(Government) స్పం దించడం లేదు. టీచర్లు కోరుతున్నవి గొం తెమ్మ కోరికలు కావు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తక్షణమే ఆర్థిక భారం కూడా అంతగా పడే పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది.
మొదట ఆర్థిక భారం లేని సమస్యలనైనా పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మోడల్ స్కూల్ టీచర్ల ప్రధాన డిమాండ్లలో ఒకటి.. వేతనాలను 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద చెల్లించడం. ప్రస్తుతం వీరికి రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తున్నప్పుడు, అదే వేతనాలను 010 పద్దు కింద చెల్లించడానికి అభ్యంతరం ఎందుకు?, ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఒక్క పైసా అదనపు భారం పడదు. కేవలం వేతనాల చెల్లింపు పద్దును మార్చడం ద్వారా వారి చిరకాల డిమాండ్‌ను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం విచారకరం.
మరోవైపు, మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల భద్రతకు సంబంధించిన స మస్య మరింత ఆందోళనకరంగా ఉంది. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆయనపై ఆధారపడిన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది. దీనికి ప్రధాన కారణం డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలన్న వారి డిమాండ్ వందశాతం న్యాయమైనది.
ఉద్యో గి మరణించిన తర్వా త ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడ టం ఏ ప్రభుత్వానికైనా కనీస బాధ్యత. ఈ సమస్యను కేవలం ఉద్యోగుల వ్యక్తిగత సమస్యగా కాకుండా, వారి కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన మానవీయ అంశంగా పరిగణించాలి. అదే విధంగా, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీజీటీలకు సంబంధించిన సర్వీసు అంశాలపైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసు కోవాలని వారు కోరుతున్నారు.టీజీటీలకు 20 13జూన్ నుంచి తమ సర్వీసును నోషనల్‌గా లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించేటప్పుడు ప్రభు త్వం ఆర్థికపరమైన అంశాలను పరిశీలించడం సహజమే. అయితే, ఆర్థిక భారం లేని, లేదా తక్షణ అదనపు వ్యయం అవసరం లేని అంశాలను కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదు. మోడల్ స్కూల్ టీచర్లు కోరుతున్న సమస్యల్లో కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలతోనే పరిష్కారమయ్యే అవకాశం ఉన్నప్పుడు, వాటిపై జాప్యం ఎందుకు జరుగు తున్నదో అధికారులు సమాధానం చెప్పాలి.
మోడల్ స్కూల్ టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయుల సమస్య లను పరిష్కరించకుండా, వారి కుటుం బ భద్రతకు సంబంధించిన అంశాలను నిర్లక్ష్యం చేస్తూ, సర్వీసు ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఉ ద్యోగుల నుంచి విధి నిర్వహణలో నిబద్ధతను ఆశించినప్పుడు, వారి న్యాయమైన హక్కులను కాపాడటంలోనూ అంతే బా ధ్యతతో వ్యవహరించాలి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం స్పందించాలి. మోడల్ స్కూల్ టీచర్ల డిమాండ్లపై సంబంధిత శా ఖల అధికారులు సమగ్రంగా పరిశీలన జరిపి, ఆర్థికభారం లేని సమస్యలపై వెంట నే ఉత్తర్వులు జారీ చేయాలి. మిగిలిన అంశాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రక టించాలి. ము ఖ్యంగా 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాల చెల్లింపు, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు సామా జిక భద్రతా ప్రయోజనాలు, టీజీటీల సర్వీ సు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చాలి.
- టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, 9848481028