వెంకటేశ్వర కాలనీ, ఎంజీ పార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
11-10-2026 | 03:03am
మణికొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మణికొండ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, ఎంజీ పార్క్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకలకు కస్తూరి నరేందర్ గారు, నెక్నాంపూర్ డివిజన్ అధ్యక్షుడు జితేందర్, తాజ్ భాయ్‌తో పాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.