రాహుల్‌గాంధీకి కీలక పరీక్ష!
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటే అధికారం. ఆ ఓటును కాపాడటమే రాజ్యాంగానికి నిజమైన రక్షణ. ఓట రు జాబితాల్లో అక్రమాలున్నాయనే ఆరోపణలొచ్చినప్పుడు వాటిపై నిర్లక్ష్యం వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వి మర్శలను రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయడం సమస్యకు పరిష్కారం కాదు. అందుకే ఓటు చోరీపై కాంగ్రెస్(Congress) నేతృత్వం లో ఢిల్లీ(Delhi) వేదికగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar)పై ఆ పదవి నుంచి తక్షణమే దిగిపోవాలని డి మాండ్ చేస్తున్నాయి. బీజేపీకి ఈసీ తొత్తు గా మారి ‘సర్’ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని మండిపడుతున్నాయి.
ఆందోళనలు.. అడ్డగింతలు..
ఢిల్లీతోపాటు దేశంలో అక్టోబర్ 2 నుంచి ప్రతిపక్ష ఇండీ కూటమి ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హస్తినలోని రామ్ లీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 10లక్షల మందితో భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. అయితే, ఈ ర్యాలీని అడ్డుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని వ్యాపారులను ముందుపెట్టింది. పండుగ సమయంలో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఢిల్లీ వర్తకుల సంఘం కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని కోరింది.
జెన్ జీ నిరసనలకు పిలుపునిచ్చిన సమయంలో అదే కేంద్రం మెట్రో సేవలను నిలిపివేసింది. రోడ్లను మూసివేయించిన తీరు విమర్శలకు తావిస్తున్నది. రాజధానిని ది గ్భంధం చేస్తే స్పందించని వ్యాపా రులను ఎవరూ ఉసిగొల్పు తున్నారో అర్థమవుతున్నది. మరోపక్క ఇండీ కూటమి అధికా రంలో ఉన్న రాష్ట్రాల్లోనూ జనసమీకరణకు అడ్డుపడుతున్నది. తెలంగాణలో ’స్పెషల్ ట్రైన్లు’ బుక్ చేస్తే రైల్వే శాఖ నిరాకరించడం వెనుక మోదీ ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టిందనేది స్పష్టమవుతున్నది.
పెద్దన్న పాత్రలో కాంగ్రెస్!
భారత్‌లో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాల పట్ల విమర్శలు, వ్యాఖ్యానాలు, రోజుల తరబడి నిరసననలు సర్వసాధారణంగా అనిపిస్తున్నది. ఆ అవకాశం ఇప్పుడు మోదీ ప్రభు త్వమే కల్పించి ప్రజాగ్రహానికి గురైంది. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోరుతూ ‘జెన్ జీ’ నిరసనలకు దిగింది. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ.. నేడు ఓటు హక్కు పరిరక్షణను రాజకీయంగా ప్రధాన చర్చనీయాం శంగా మార్చారు. ఈ క్రమంలో రాజ్యాంగ పరిరక్షణ, ఎన్నికల జవాబుదారీతనం, ప్ర జల హక్కుల రక్షణ వంటి అంశాలపై విపక్షాలను ఏకం చేయగలిగితే రాహుల్ నా యకత్వానికి జాతీయ స్థాయిలో మరింత బలం చేకూరుతుంది.
అయితే ప్రతిపక్షాల ఐక్యత అనేది.. నాయకులు ఒకే వేదికపై కనిపించడంతో పూర్తి కాదు. ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు, రాజకీయ విభేదాలు, నాయకత్వ సంబంధిత అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలి. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పో షించి ముందుకు సాగుతున్నది. అదేవిధంగా ఇతర పార్టీలకూ ప్రాధాన్యమివ్వాలి. ప్రజలకు అర్థమయ్యే డిమాండ్లతో, ఆధారాలతో, నిరంతర కార్యాచరణతో ముం దుకు సాగాలి. రాహుల్ ప్రధాని కావాలం టే ముందుగా ఓటు హక్కు సురక్షితమా లేదా అనేది పార్టీ, రాజకీయాలకతీతమైన ప్రజాస్వామ్య ప్రశ్న. ఈ రెండింటినీ కలగలపకుండా, ఓటు పరిరక్షణే లక్ష్యంగా నిలబడినప్పుడే రాహుల్ పోరాటానికి విస్తృత ప్రజాదరణ, మద్దతు లభిస్తుంది.
ఓటే ప్రశ్న.. ఓటే సమాధానం!
సర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు దేశంలో 99కోట్ల ఓటర్లున్నారు. ముగిసిన తర్వాత 13.3 కోట్ల ఓటర్ల తొలగింపుపైనే ‘సర్’పై చర్చకు దారితీసింది. చనిపోయిన వాండ్ల ఓట్లు 2.80కోట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు 1.02 కోట్లు.. వీటితో పంచాయితీ లేదు. వచ్చిందల్లా అందుబాటులో లేరని, వలస వెళ్ళినవారు అంటూ భారీస్థాయిలో ఓట్లు రద్దు కావడమే చిక్కుగా మారింది.
ఓటుపెట్టెలో పడేది కేవలం ఓటుకాదు. ప్రజల భవిష్యత్తు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి ఓటు హక్కు పవిత్రతపైనే అనుమానాలు తలెత్తితే దేశం మౌనంగా ఉండగలదా? ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన పాలకులు, ఆ తీర్పు పారద ర్శకంగా వెలువడిందా?అనే ప్రశ్నకు సమా ధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోగలరా? ఓటరు జాబితాల్లో అక్రమా లు జరిగాయన్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాలు సమరశంఖం పూరిస్తు న్నాయి.
ఇది కేవలం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న రాజకీయ పోరా టమే కాదు.. ప్రతి పౌరుడి ఓటుకు భరోసా కల్పించాలనే ప్రజాస్వామ్య డిమాండ్. విభేదాలను పక్కనపెట్టి ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి వస్తే, ఈ పోరాటం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుంది.
రాహుల్ నాయకత్వం ఆ ఐక్యతకు దిశానిర్దేశం చేయగలదా? ఓటుహక్కు పరిరక్షణను జాతీయ ఉద్యమంగా మలచగలదా? ఇప్పుడు దేశం దృష్టి ఢిల్లీ వైపు మళ్లడానికి కారణం ఇదే. హస్తిన గడ్డపై మొదలయ్యే పోరాటం రాజకీయ పార్టీల బలప్రదర్శనగా కాకుండా... ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలిచేలా కార్యాచరణ సాగాలి. రాహుల్ నాయకత్వంలో విపక్షాల ఐక్యత బలపడితే, ఎన్నికల పారదర్శకత అంశాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్య మంగా మలిచే అవకాశం ఉంది.
ప్రతి ఓటరుకూ న్యాయం జరగాలి..
ఢిల్లీ గడ్డపై ఎగరాల్సింది ఒక పార్టీ విజయపతాకమే కాదు.. ప్రజాస్వామ్య పరిర క్షణ పతాకం. ఆ పోరాటం అధికార మార్పి డి ఆకాంక్ష వరకే కాకుండా, ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా సాగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల ఓటుతోనే ఏర్పడుతుంది.
ఆ ఓటు విలువను కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత, దానిపై నిఘా ఉంచడం రాజకీయ పార్టీల బాధ్యత. ఓటు ప్రజలది.. అధికారం ప్రజల తీర్పుతోనే.. ఆతీర్పు స్వచ్ఛతపై సందేహాలు తలెత్తితే జవాడు చెప్పాల్సిందే. రాహుల్ నాయకత్వంలోని ప్రతిపక్ష పోరాటం ఆధారాలతో, ఐక్యతతో, ప్రజల భాగస్వామ్యం తో ముందుకు సాగితేనే అది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా నిలుస్తుంది. ప్రజల ఓటుకు రక్షణ.. రాజ్యాంగానికి గౌరవం.. ఎన్నికల వ్యవస్థకు విశ్వసనీయత, ఇవే ఈ పోరాటానికి అంతిమ లక్ష్యాలు కావాలి.
ఢిల్లీ ధర్నా ఒకరోజు నిరసనగా ముగిసిపోకూడదు. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ల్లోని తప్పులను పరిశీలించడం, అన్యాయంగా తొలగించిన పేర్లను పునరుద్ధరిం చేందుకు చర్యలు తీసుకోవడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచడం వంటి అంశాలపై ప్రతిపక్షాలు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలి.ఎన్నికల సంఘం వద్ద ఉన్న రికార్డులను నిబంధనల ప్రకారం పరిశీలించేందుకు వీలు కల్పించాలి. ఫిర్యాదు ల పరిష్కార స్థితిని ప్రజలకు తెలియజేయాలి. అవసరమైతే కోర్టులను ఆశ్రయించాలి.
వ్యక్తులపై విమర్శలు కాకుండా, వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించే సంస్కరణ లపై దృష్టి పెట్టాలి. రాహుల్ ఈ బాధ్యత ను సమర్థంగా నిర్వహించి, ప్రతిపక్ష పార్టీ లను ఒకేవేదికపైకి తీసుకురాగలిగితే, ఓటు పరిరక్షణ పోరాటం జాతీయ రాజకీయాలకు కొత్త దిశ చూపగలదు. మొన్న ‘నీట్’ నేడు ‘సర్’తో ప్రధాని మోదీ భేషజాలకు పోయి, జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించకుండా సర్ నిర్ణయాలు ఏకగ్రీవమేపంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినా 140కోట్ల ప్రజ లు నమ్మే స్థితిలో లేరు. ప్రజాస్వామ్యంలో విమర్శలను అణచివేయడం కంటే, వాటికి వాస్తవాలతో జవాబివ్వడమే బలమైన పాలనకు నిదర్శనం.
వ్యాసకర్త : కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355
ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్