రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆస్తి

29-10-2026 | 05:05am
  1. జనగణనలో ఓబీసీ కాలమ్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి
  2. లేదంటే తెలంగాణలో జనగణనను అడ్డుకోవాలి
  3. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ సర్కారు కుట్ర
  4. హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ముషీరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రిజర్వేషన్‌లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్తంగా బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభలో ఆమె ప్రసంగించారు.

తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. కేంద్రం అందుకు అంగీకరించకపోతే తెలంగాణలో జనగణనను నిర్వహించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ తో పాటు డ్రాప్ డౌన్ బాక్స్ ఉండాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాటం చేయాల్సి ఉందన్నారు. 

జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని డిమాండ్ చేస్తూ నవంబర్ లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓబీసీ సంఘాలు నిర్వహించే ధర్నాలో తాము పాల్గొంటామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.   బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీని నిలబెట్టుకోవాలని తాము ఉద్యమిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు.  భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆమూల్యమైన ఆస్తి రిజర్వేషన్లేనని కవిత అన్నారు.

బీసీల లెక్క తెలి యక పోవటంతోనే వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ దేశ బడ్జెట్ ఏడాదికి రూ. 50 లక్షల కోట్లు ఉంటే ఏటా బీసీలకు రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయటం లేదన్నారు.  తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తెచ్చే సైక్లోన్ తో ఓటు చోరీతో పాటు ఓబీసీలకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీ అధికార పీఠం ఊడటం ఖాయమని బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ సూరజ్ మండల్ అన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న ఓబీసీల కోసం పోరాటం చేసేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన కవిత భవిష్యత్ లో తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు.

కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలను 42 ఏళ్ల పాటు మో సం చేశాయని తమిళనాడుకు చెందిన రైట్స్ ఆఫ్ ఓబీసీ పార్టీ అధ్యక్షుడు తిరు రత్న సభాపతి పేర్కొన్నారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు వారి వాటాకు అనుగుణంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సభలో దేశ వ్యాప్తంగా ఓబీసీల కోసం పోరాటం చేస్తున్న నాయకులు యెజ్జురప్ప, ధర్మేంద్ర కుశ్వాహ, ఉమేశ్ కొర్రం సకల, గీతిక, సునీల్ వర్మ, రైజా బీబీ, బన్సీ లాల్ నీలం కుమారి, విశ్వజిత్ రతోనియా తదితరులు పాల్గొన్నారు. 

ఓబీసీ డిక్లరేషన్లోని ప్రధాన డిమాండ్లు

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి. ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలి. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు వాటా కల్పించాలి. 1931 జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా 52 శాతంగా ఉన్నందున 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. విశ్వవిద్యా లయాల్లో సామాజిక న్యాయం అమ లు చేయాలి. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో 42 శాతం, మధ్యప్రదేశ్లో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.

మరిన్ని వార్తలు