గుండెల్లో గోదారి
నిజం! చెప్పాలని వుంది..అది నిష్ఠురమే అయినప్పటికీ..అబద్ధం! నాలిక మీద వెయ్యి పల్టీలు కొడుతూ వికృతానందం పొందుతుంది ఎదో ఘన కార్యం చేసి ఒరగా బెట్టినట్లు సై అంటే తందానా అన్నట్లు ఈ మాయలోకం దానిచుట్టే భజన చేస్తుంటే అబద్ధం నిజమే అన్నట్లు పెదవిపై లిప్ స్టిక్‌ల మెరిసిపోతు వగలు పోతుంది..అయినా నిజం నిప్పులాంటిది..గెలుపు కోసం పడరాని పాట్లు పడ్డ అమ్మ గర్భంలో ఎదిగిన మనం అది అబద్ధం అని ఏ ఒక్కరయినా చెప్పగలరా?
ఆ తల్లీ’ గుండెల్లో గోదారి’ అలల వేదన పరవళ్లు తొక్కుతుంటే..ఎన్నెన్నో అవమానాలు ఎదురైనా..సమాజం ఛీ కొట్టిన..చెయ్యని నేరానికి శిక్ష వేసిన.. ఎవ్వడో చేసిన పాపానికి పుట్టే బిడ్డకు తల్లీ అయి కడుపులో పసికందును చంపుకుంటుందా? ఎంతైనా అమ్మ అమ్మే కదా..! నవ మాసాలు మోసి ఈ మట్టి గట్టు మీద కొత్త తరానికి పురుడు పోసి పెంచిన ఆ తల్లీ ఋణం తీర్చుకునేదెలా?
పిచ్చిదే కావచ్చు, అక్షరం ముక్క రాకపోవచ్చు.. లోకం తెలిసిన జ్ఞాన వంతురాలు కాకపోవచ్చు పేగు తెంచుకు పుట్టిన బిడ్డకి జోల పాడి నాలుగు మాటలు చెప్పి బతుకు బాటను పరిచయం చేసి రేపటి నవోదయం కోసం కలలు కంటున్నా అణగారిన,
బడుగు వర్గాల ఆశజ్యోతి తొలకరి జల్లుల కమ్మదనం ఆస్వాదించే మట్టి వాసనాల తొలిచురు మొలకల సింగిడి గారడీ గాళ్ళ ఆట కట్టించి నిజాన్ని నిప్పుల మీద నడిపించి మనిషిలోని మానవత్వానికి రెక్కలు తోడిగే శ్రీ శ్రీ మహా ప్రస్థానం అంబుల పొదిలోని మండుతున్న అక్షర నిప్పు కణిక అంధకారం చీకటి గుహలో మూఢ నమ్మకలతో పెట్రేగిపోతున్న.
ఈ సమాజం మేలుకొలుపుకై ఆరాటపడుతూ నూతన ప్రజాస్వామిక గొంతుకకు ప్రాణమై మాతృత్వ మమకారానికి శ్రీ రామ రక్షయి ఎదురు నిలిచి పోరాడుతున్న అభాగ్యుల తొలిపొద్దు కిరణం ఆమె! నాన్న! ఎవరో తెలియని పసిపాపలకు అన్నీ తామై పెంచే ఒంటరి తల్లులకు ఈ జాతి అండగా నిలబడాలి అన్యాయం, అక్రమాలపై పోరు సలిపి బిడ్డలను ఒంటరి చేసి అసువులు బాసిన అమ్మలు కన్న భావి పౌరులయిన ఈ అనాథ శిశువులను అక్కున చేర్చుకోవాలి..
తాము ఉన్నామనే భరోసా కల్పించి భారత మాత కన్నీళ్లు వరదలయి మనల్ని ముంచేత్తక్క మునుపే..అబద్దాల ప్రపంచానికి ఘోరి కట్టి నిజాల్ని నిర్భయంగా ఊరేగించి అమ్మతనానికి జేజేలు పలకాలి..ఆమె చల్లని చూపులు దారిదీపాలయి చిరునవ్వుల పాపల కళ్ళలో పున్నమి వెన్నెల సరాగాలు విరజిమ్మాలి.
కొండా రవీందర్ 9059237771