మహోన్నతుడు వట్టికోట

26-10-2026 | 05:05am

తెలంగాణా నవలా సాహిత్యం... అనగానే స్ఫు రించే మొదటి పేరు వట్టికోట ఆళ్వారుస్వామి(Vattikota Alwar Swamy), ‘అబద్దాసుకుని పాలిట తల్వార్ అళ్వార్’ అంటూ అళ్వా రు స్వామిని కాళోజి అభివర్ణించాడు. దాశరథి తమ ‘అగ్నిధార కావ్యాన్నీ, కేతవరపు రామకోటిశాస్త్రి తమ వీహె చ్.డి. సిద్ధాంత గ్రంథాన్ని, దాశరథి రంగాచార్య ’జనపదం’ నవలనూ శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామికి అంకిత మిచ్చి తమ గౌరవాన్ని ప్రకటించారు.

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సమీపాన గల మాధవరం అనే గ్రామం లో 1915 నవంబర్ ఒకటిన నిరుపేద శ్రీవైష్ణవ బ్రాహ్మణ దంపతులు శ్రీమతి సింహాద్రమ్మ, శ్రీమాన్ రామచంద్రాచార్యులడు పుట్టిన బిడ్డ ఆళ్వార్ స్వామి.

నిరుపేద కుటుంబం, దుర్భర దారిద్య్రం, బాల్యంలో చదువు వంటబట్టలేదు. బడిమాని, ఇంట్లోంచి పారిపో యి వచ్చి, హెూటల్ సర్వర్‌గా పనిలో కుదిరాడు. నెల కు నాలుగు రూపాయల జీతం. చాలీచాలని జీతంతో జీవితయాత్ర కొనసాగిస్తున్న ఆళ్వార్ స్వామి పన్నెండవ ఏట, వారి తండ్రి మరణించారు. నకిరేకల్ వాస్తవ్యులు శ్రీ కంచినేపట్టి సీతారామారావనే ఉపాధ్యాయుడికి వంట చేసి పెడుతూ,

ఆళ్వార్ అతని వద్ద విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆ ఉపాధ్యాయుడు సూర్యాపేటకు బదిలీ కావ టంతో ఆళ్వార్ స్వామి కూడా గ్రామం నుంచి తాలూకా కేంద్రానికి నివాసాన్ని మార్చాడు. కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు అతనిలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. 1928- సంవత్సరాల నడుమ శ్రీ కోదాటి నారాయణరావుగారితో సూర్యాపేటలో పరిచయం ఏర్పడింది.

కొంతకాలం గడిచాక కందిబండ గ్రామానికి చెందిన శ్రీ నారపరాజు రాఘవరావుగారింటికి అళ్వార్ స్వామి తన మకాం మార్చాడు. రాఘవరావు గారిది సంపన్న కు టుంబం. అతిథి, అభ్యాగతులకు ఆదరణ, గౌరవమిచ్చే కుటుంబంతో అతనికి అతి స్వల్పడాలంలోనే సాన్నిహిత్యం ఏర్పడింది. రాఘవరావుగారి సోదరుల్లో ఒకడి గా ఆళ్వార్ స్వామి కలిసిపోయాడు.

నారపరాజు సోదరులు తమ తండ్రి జ్ఞాపకార్ధం ‘సీతారామ గ్రంథాలయా న్ని’ నెలకొల్పారు. విలువైన గ్రంథాలనూ, అందుబాటులో ఉన్న పత్రికలనూ తమ గ్రంథాలయానికి తెప్పించ డం ప్రారంభించారు. దీంతో సహజంగానే ఆళ్వార్ స్వా మి పఠనాసక్తి, పత్రికా పఠనం పెంపొందించాయి. 1933 ప్రాంతంలో శ్రీ యామనాచార్యుల ప్రోద్బలంతో ఆళ్వార్ స్వామి హైదరాబాద్ పట్టణానికి తన మకాం మార్చాడు.

అప్పటికే హైదరాబాద్ కు చేరి, అక్కడ గోలకొండ పత్రికలో శ్రీ కోదాటి నారాయణరావు ప్రూఫ్ రీడర్ గా ఉద్యో గం చేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని మానేయాలని కోదాటి వారు భావిస్తున్న రోజుల్లో, వారికి ఆళ్వార్ స్వామి కన్పించాడు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సిఫారసు చేసి, కోదాటి నారాయణరావుగారు ఆళ్వార్ స్వామికి గోలకొం డ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగం ఇప్పించారు.

నెలకు పదిహేను రూపాయల జీతం. అతికష్టంగా సరిపోయేది. జీతం సంగతి. ఎలా ఉన్నా పత్రికాఫీసులో పనిచేయడం వలన సమాజాన్ని, జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయం చేసే అవకాశం ఆళ్వార్‌కు దొరికింది. కొంతకాలానికి ఆళ్వార్ స్వామి ఈ ఉద్యోగం మానేసి, మళ్ళీ కందిబండలోని రాఘవరావు గారి కుటుంబాన్ని ఆశ్రయించాడు. అక్కడి గ్రంథాలయంలోని అనేక గ్రంథాలను ఆసక్తిగా పఠించాడు. అంతేకాదు క్రమంగా రచనా వ్యాసంగం ప్రారంభించాడు. ఆంగ్ల భాషాధ్యయనంపై అతని దృష్టి మళ్లింది.

స్వయంకృషితో ఆంగ్లం నేర్చుకోవడం ప్రారంభించారు. నారపరాజు వారి కుటుంబం తరచుగా బెజ వాడ వెళ్లి వస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసి పోయిన ఆళ్వార్ కూడా బెజవాడకు వెళ్తూ ఉండడంతో, అక్కడి ’వెల్కం హెూటల్’ వారితో ఇతనికి పరిచయమేర్పడింది. హోటల్ యాజమాన్యంతో మాట్లా డి, అక్కడ సర్వర్ ఉద్యోగంలో చేరాడు.

ఉచిత భోజన వసతులతో పాటు అరవై రూపాయలు నెల జీతానికి కుదిరాడు. తన సంపాదన నుండి ఎనిమిది రూపాయల ఫీజు చెల్లించి, ఇంగ్లీషు తరగతులకు హాజరయ్యాడు. జీతం రాళ్లను పొదుపుగా ఖర్చు పెడుతూ, కొంత డబ్బు మిగిల్చి పుస్తకాలనూ, పత్రికలనూ కొని చదవడం కొనసాగించాడు. 

1934- నడుమ రెండేళ్ళపాటు బెజవాడ హెూట ల్ కార్మికుడిగా పని చేయడంతో ఆళ్వారుస్వామి జీవితం కొత్త మలుపు తిరిగింది. అప్పటి బెజవాడ, మద్రాసు రాజధానిగా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. నిజామాంధ్ర ప్రాంతం పోలిస్తే సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం. పత్రికాస్వేచ్ఛ, సభా స్వేచ్ఛలుండేవి. వెట్టి చాకిరి ఉండేదికాదు. ఏదో ఒక మేరకు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలుండేవి.

నారపరాజు రాఘవరావుగారి కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం 1986లో ఆళ్వార్ స్వామి తన నివాసా న్ని బెజవాడ నుండి హైదరాబాదుకు మార్చాల్చి వచ్చింది. 

హైదరాబాదులో ఉన్నత విద్య చదువుకుంటున్న నారపరాజు కుటుంబ సభ్యులకు వంట చేసి పెడుతూ, తీరిక సమయంలో వారి వద్ద ఇంగ్లీషు విద్యను కొనసాగించాడు. ప్రజాహిత సంస్థలతో, సంఘసేవకులతో, సాహి తీ వేత్తలతో క్రమంగా ఆళ్వార్ స్వామి పరిచయాలు పెం చుకున్నాడు. సికింద్రాబాద్‌లోని యువకులను సమీకరించి, చైతన్యపరచి, వారిని సామాజిక సేవా రంగంవైపు ఆకర్షించాడు.

గ్రంథాలయోద్యమంతో, ఆంధ్రోద్యమం తో సంబంధాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్‌లో జరిగిన ఆరవ ఆంధ్ర మహా సభలో సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఏకైక ప్రతినిధిగా హాజరయ్యాడు. ’ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం’లో కొంతకాలం పాటు కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు.

శ్రీమతి రాచమల్ల సత్యవతీదేవి సంపాదకత్వాన ప్రారంభమైన ’తెలుగుతల్లి’ పత్రికను కొంతకాలం పాటు ఆళ్వార్ స్వామి నిర్వహణ బాధ్యతలు చేపట్టి వెలువరించాడు. 1938లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్ఫూర్తితో ’దేశోద్ధారక గ్రంథమా ల’ను అళ్వారస్వామి నెలకొల్పాడు. ఆరవ ఆంధ్ర మహాసభలో అతివాదుల పక్షం వహించిన ఆళ్వాస్వామి, చిలు కూరులో జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభలో మితవాదులు వెనక నిలిచాడు.

1942 క్విట్ ఇండియా ఉద్యమ ప్రేరణతో సికింద్రాబాద్‌లో జరిగిన సత్యాగ్రహంలో కాంగ్రెస్ వాదిగా పాల్గొ న్న ఆళ్వార్ స్వామిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. సికింద్రాబాద్ జైలులో ఏడాదిపాటు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సాన్నిహి త్యం ఏర్పడింది. కమ్యూనిజం ఆదర్భాలు, లక్ష్యాలు, పో రాట నిబద్ధతలతో ప్రభావితుడైనాడు.

జైలు నుండి విడుదల కాగానే ఆంధ్ర మహాసభకు ఆర్గనైజర్ గా పనిచేస్తూ హైదరాబాద్ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో మీర్జా ఇస్మాయిల్ ప్రధానిగా నియమింపబడ్డాడు. కమ్యూనిస్టు పార్టీపై విరుచుకుపడ్డాడు. పెద్ద ఎత్తు న కార్యకర్తల అరెస్టులు జరిగాయి. ఆళ్వార్ స్వామిని అరెస్టు చేసిన నిజాం పోలీసులు రెండేళ్ళ పాటు సంగారెడ్డి, గుల్బర్గా, హైదరాబాద్, వరంగల్ జైళ్ళలో తిప్పారు. కారాగార జీవితాన్ని గ్రంథ పఠనానికి, మేధోవికాసానికి ఉపయోగించుకున్నాడు. జైల్లో తోటి ఖైదీలకు చక్కని విజ్ఞానాన్ని అందించడంతోపాటు, 

కమ్మని వంటకాలు వండి తినిపించేవాడు. రాజకీయ ఖైదీలతోనూ, సాధారణ ఖైదీలతోనూ ఆత్మీయంగా మెలిగిన ఆళ్వార్ స్వామి వారి జీవితానుభవాలను, కష్టసుఖా లను తెలుసుకున్నాడు. ఖైదీల సమస్యలపై జైలు అధికారులకు విజ్ఞప్తి పత్రాలు సమర్పిస్తూ, పరిష్కారం కోసం కృషి చేసేవాడు. తోటి ఖైదీల జైలుజీవితం, తన స్వీయ అనుభవాలను జోడించి 1950లో ‘జైలు లోపల’ కథలను రచించాడు. ‘ప్రజల మనిషి’, ’గంగు’ అన్న రెండు గొప్ప నవలలను రచించి, తెలంగాణ సాయుధ పోరాట నవలా సాహిత్యానికి ఒరవడి దిద్దాడు.

1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచనం జరిగిన తరువాత, అనేక మంది రాజకీయ ఖైదీలు జైలు నుండి విడుదలయ్యారు. అళ్వార్ స్వామి మాత్రం మరో ఏడాదిన్నర పాటు జైల్లో మ్రగ్గవలసి వచ్చింది. నిజాం ప్రభుత్వం అతనిపై మోపిన క్రిమినల్ కేసులే దానిక్కారణం. ’దేశోద్ధారక సూచి గ్రంథాలయం’ పేరిట సికింద్రా బాద్ లో ఒక రిఫరెన్స్ లైబ్రరీని ఏర్పాటు చేశాడు.

అనేక అరుదైన ప్రాచీన గ్రంథాలను సేకరించాడు. కొత్త ప్రచురణలనూ సమకూర్చాడు. దిన, మాసపత్రికలు సంపు టాలను సంపాదించి పెట్టాడు. పెదాలపై వెన్నెల వంటి చిరునప్పు, హృదయంలో ప్రేమ నిండిన ఆత్మీయత, మాటల్లో మమకారం, చేతల్లో నిజాయితీ నిండిన ఉత్తమ మానవుడు శ్రీ ఆళ్వార్ స్వామి. పరిచయమైన ప్రతి వ్యక్తి పై ప్రగాఢమైన ప్రభావాన్ని వేసిన ఉన్నతమైన వ్యక్తిత్వం అతనిది.

నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కార్యావరణ పట్ల నిమగ్నత కలిగిన ఆళ్వార్ స్వామి చిత్తశుద్ధి అతని రచనల్లో ప్రతిబింబిస్తున్నది. అతనికి పరిచయమైన సామా జిక వాతావరణం, గ్రామీణ జీవన పరిణామాలు, వ్యక్తు ల మనస్తత్వాలు అతని కథల్లోనూ, నవలల్లోనూ వ్యక్తమైనాయి. 1961 ఫిబ్రవరి 6న చెప్తీరియా’ వ్యాధి వలన హృదయ చలనం ఆగిపోయిన ఆళ్వారాస్వామి అకాల మరణం పొందాడు. వినాదైన్యేన జీవనం, అనాయాస మరణం పొందిన ఆళ్వార్ స్వామి వేలాదిమంది మిత్రు ల, సహచరుల, సన్నిహితుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 

సేకరణ: తెలంగాణ తేజోమూర్తులు, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నుంచి

రచయిత: ఆచార్య ఎస్వీ సత్యనారాయణ


మరిన్ని వార్తలు