పెచ్చులూడుతున్న బస్టాండ్
- ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
- పొంచి ఉన్న ప్రమాదం
బిచ్కుంద, అక్టోబర్25 (విజయక్రాంతి): మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లా బిచ్కుంద బస్టాండ్ పై కప్పు పెచ్చులూడి ప్రమాదకర పరిస్థితి లో ఉంది. దీంతో బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు పైనుంచి పెచ్చులూడుతాయో నని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బిచ్కుంద పట్టణ కేంద్రంలోని బస్టాండ్ పైకప్పు పెచ్చులూడి కాంక్రీట్ ఊడిపడుతోందని ప్రయాణికులరోపిస్తున్నారు. బస్టాండ్ నుంచి నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో పైకప్పు దెబ్బతినడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
పైకప్పులోని ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పైకప్పుకు మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
బస్టాండు పెచ్చులుడుతుండడంతో మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి పెచ్చు లుడుతున్న బస్టాండ్ కు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
ఆందోళన తప్పడం లేదు..
బిచ్కుంద బస్టాండ్ కు బస్సుల కోసం వస్తే ఆందోళన తప్పడం లేదు. ఎప్పుడు పైనుంచి పెచ్చులుడు తాయో తెలియదు. బస్సు లు ఎక్కేదాకా ఆందోళన తప్పడం లేదు. ప్రతిరోజు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
మహేష్, ప్రయాణికుడు, బిచ్కుంద
మరమ్మతులు చేపట్టాలి..
బిచ్కుంద బస్టాండ్ కు ఆర్టీసీ అధికారులు మరమ్మతులు చేపట్టాలి. ఎప్పుడు కూలుతుందో నన్న భయం ప్రయాణికులను వెంటాడుతుంది. బస్టాండ్ నుంచి వెళ్లే వరకు ఆందోళన చెందాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండుకు మరమ్మత్తులు చేపట్టాలి.
కృష్ణ, ప్రయాణికుడు, డోన్ గావ్, కామారెడ్డి జిల్లా