యువత చేతుల్లోనే దేశ భవిష్యత్
నేటి యువత ఆవశ్యకత దేశానికి ఎంతో అవసరం. యువత సన్మార్గం(The right path)లో పయనిస్తూ వారి లక్ష్య సాధనలో నిర్విరామ కృషి చేసినప్పుడే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితు ల్లో లక్ష్యం, కచ్చితమైన మార్గం, ఉత్తమ లక్షణాలు గల యువత కనుచూపుమేరలో లేరని చెప్పొచ్చు. తాను అనుకున్నది సాధించగలననే ఆత్మవి శ్వాసం చాలామందిలో కొరవడింది. ఒక విధంగా లక్ష్యం లేని వ్యక్తి చుక్కా ని లేని పడవలాంటివాడు. చుక్కాని లేనిదే పడవ నడవలేదు గాలి ఎటు వీస్తే అటువైపు వెళ్తుంది.
అలాగే నిర్దేశిత లక్ష్యంలేని వ్యక్తి.. తనపై ఏది ఎక్కు వ ప్రభావం చూపుతుందో దాని మార్గంలోనే వెళ్లటానికి ప్రయత్నిస్తాడు. నేటి యువతకు మాహాతత్వ వేత్త, భారత సంస్కృతీసంప్రదాయాలను, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచదేశా లకు చాటి చెప్పిన ధీశాలి స్వామి వివేకానందుని మాటలు, ఉపన్యాసాలు స్ఫూర్తి కావాలి. నవ భారత నిర్మాణానికి వివేకానందుడు(Swami Vivekananda) ఆలోచనలను ఆచరించే యువకులు నేడు కరువయ్యారు. అభాగ్యుల, అన్నార్థుల కష్టాలను రూపుమాపి సుసం పన్నమైన, దృఢమైన భరత జాతి నిర్మాణానికి యువలోకం పట్టువీడని దీక్షతో కృషి చేయాలనే వివేకుని సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని ఆచరించే సమయం ఆసన్నమైంది.
యవ్వన సృహ లేక..
యువతకు యవ్వనంలో ఉన్నామనే స్పృహ తెలియక పోవడం వారికి అసలైన విషాదం. అందుకు కారణం వారు చేసే అదుపుతప్పిన కార్యకలాపాలు, విలాసాలు. యవ్వన సౌరభంలోని శక్తి, దీప్తి, వాడివేడిని ఆ వయస్సులోనే గుర్తించగలిగితే కాపాడుకోవడం, వినియోగించుకోవడం ఎలానో తెలుస్తుంది. అంతేకానీ అనవసర ప్రవర్తన, మితిమీరిన ఆధునిక అలవాట్లను ఆసరాగా చేసుకొని విషాదభావాలను సృష్టించుకొని జీవిత పతనానికి దగ్గరకాకూడదు. ప్రస్తుత కాలంలో యువత మహత్తర శక్తి, యు క్తిని దుర్వినియోగం చేస్తూ ఎందుకు పనికిరాకుండా పోతున్నారు.
యవ్వనపు కాలం గడిచిపోయాక దాని ప్రాధాన్యతను తెలుసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. భారత్కు యువ సంపద ఒక గొప్ప అవకాశం. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం యువతతో పాటు ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీలు, పరిశ్రమలు, సమాజంపై కూడా ఆధారపడి ఉంటుంది. యువత ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి అవసరం. ఆ ప్రశ్నలకు వాస్తవాలు, చర్చలు, పరిష్కారాల ద్వారా సమాధానాలు లభించడం అంతకంటే ముఖ్యం. యువత కేవలం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశాల వెంట నడవకుండా, తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, సమాజ అభివృద్ధి గురించి ఆలోచించాలి. దేశం మారాలంటే యువత ఆలోచనలు మారాలి. ఆ ఆలోచనలు కార్యాచరణగా మారాలి. ఆ కార్యాచరణ ప్రజలకు ప్రయోజనం కలిగించాలి.
దేశంలో యువత నిజమైన ప్రభావం అంటే కేవలం వైరల్ వీడియోలు, రాజకీయ చర్చలు, ఆన్లైన్ ఉద్యమాలు కాదు. ఉద్యోగాల సృష్టి, నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నాయకత్వం, సామాజిక ఐక్యత, శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో వారి పాత్రే అసలైన కొలమానం. యువత దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, సరైన అవకాశాలు, బాధ్యతలు కల్పిస్తే దేశ వర్తమానాన్ని కూడా మార్చగల శక్తి. కావున యువత బలంతో, ధై ర్యంతో, బాధ్యతతో తమ లక్ష్యాలను సాధించి ఘనకీర్తిని కలిగి న విజయశిఖరాలను అధిరోహించాలి. అప్పుడే మన తల్లి దండ్రులకు, గురువులకు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకరాగలు గుతాం. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.
వ్యాసకర్త సెల్: 9550837962,
వంశీకృష్ణ గౌడ్ బండి