గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చి, పక్కా ఇండ్లు కట్టించాలి

21-10-2026 | 06:25pm

హనుమకొండ, అక్టోబర్ 21(విజయక్రాంతి): వైఎస్సార్ నగర్(YSR Nagar) గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చి, పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ చీఫ్ విప్ దాస్యం ఏ భాస్కర్(Dasyam A. Bhaskar) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదల పొట్టగొట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం రోజున హన్మకొండ వడ్డేపల్లి(Vaddepally, Hanamkonda) లోని ఆయన నివాసంలో వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు వినయ్ భాస్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.

ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) తమను బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆయనకు ఒక లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేసి, న్యాయం చేయాలని వేడుకున్నారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వైఎస్సార్ నగర్‌ లో పేద ప్రజలు నివాసముంటున్న భూములపై కొందరు బడా బాబులు, పెద్దల కన్ను పడిందని,సీలింగ్ యాక్ట్‌లో ఉన్న ఈ భూముల్లో జ‌రిగిన నిర్మాణాల‌కు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమ‌తులు రాలేద‌ని, ఇప్ప‌డు ఈ కాంగ్రెస్ పాల‌న‌లో కొన్ని నిర్మాణాల‌కు అనుమతులు వ‌చ్చాయంటే ప్ర‌భుత్వంలోని ప్ర‌జాప్ర‌తినిధులు అవినీతి ప‌రుల‌తో ములాఖ‌త్ అయ్యార‌ని అర్థ‌మ‌వుతోంద‌ని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల‌లో పేదలకు మేలు చేయడం పక్కనబెట్టి, వారి గుడిసెలను దౌర్జన్యంగా కూల్చుతూ, వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు గుడిసెవాసులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆ విలువైన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

గుడిసెవాసుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. వైఎస్సార్ నగర్‌లో నివసిస్తున్న అర్హులైన గుడిసెవాసులందరికీ తక్షణమే ప్రభుత్వ పట్టాలు పంపిణీ చేయాలని, వారందరికీ అక్కడే పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ కాలనీవాసులు, మహిళలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు