జిఎంఆర్ బృందావన్ గణపతి కి ప్రథమ బహుమతి
హనుమకొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ లో ప్రతిష్ఠించిన గణపతికి గణపతి నవరాత్రి ఉత్సవ సమితి పక్షాన ప్రథమ బహుమతి దక్కింది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి మంగళవారం కాళోజి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ బహుమతిని జిఎంఆర్ వాసులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిఎంఆర్ అధ్యక్షులు వి. దయాకర్ రెడ్డి(GMR President V. Dayakar Reddy), ఉపాధ్యక్షులు కోటి చింతల వెంకటరావు, కోశాధికారి డి. నవీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, విగ్రహ దాత చింతకుంట్ల రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో,పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ పూజలు నిర్వహించడం విశేషం.ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులలో భక్తిభావాన్ని నింపాయి. ఉత్సవాలు విజయవంతానికి జిఎంఆర్ బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీతో పాటు శ్రీ విజయ గణపతి ఉత్సవ సమితి కమిటీ సభ్యులు అహరహం శ్రమించారని నిర్వాహకులు తెలిపారు.