నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

23-09-2026 | 12:03am

కమిషనర్ రమాదేవి

కోదాడ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కోదాడ పెద్ద చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమాదేవి(Municipal Commissioner Ramadevi) తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ క్రేన్లు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, భక్తులు స్నానాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవలందించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులు శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు