కాకతీయ కాలువ నీటి విడుదల బీజేపీ పోరాట ఫలితమే
కొత్తపల్లి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శి గుంజేటి శివకుమార్ హాజరై మాట్లాడుతూ... అనేక సంవత్సరాలుగా కరీంనగర్లో నిర్వహిస్తున్న వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం చింతకుంట కెనాల్ వద్ద నిర్వహిస్తున్నారు.
దీని పరిశీలినకు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్లతో పాటు వివిధ అధికారులతో చింతకుంట సందర్శించడం జరిగింది సంబంధిత అధికారులకు కూడా ఫోన్ చేసి నీటిని విడుదల చేయాలని కోరడం జరిగింది. కానీ రెండు రోజుల నిమజ్జనం ఉన్నా కూడా ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయకపోవడంతో, బీజేపీ హిందూ సంఘాలు ఖండించి సోమవారం రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ,వినాయక మండపాల మండపాల నిర్వహణ నాయకులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి నీటిని విడుదల చేయడం జరిగింది.
బిజెపికి వచ్చిన మైలేజ్ ఓర్వలేకనే స్థానిక కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ మరియు కాంగ్రెస్ నాయకులు వచ్చి మా వల్లనే జరిగిందని గొప్పలకు చెబుతున్నారు. గతంలో మీ ప్రభుత్వాలు కార్పొరేషన్ కి కేటాయించిన నిధులు ఇప్పుడు బిజెపి కార్పొరేషన్ మేయర్ కాగానే రెట్టింపు నిధులతో రెట్టింపు ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు కేవలం కరీంనగర్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ హిందువుల పండుగ అనగానే చిన్న చూపు చూస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ హిందువులకు అండగా ఉండే బీజేపీ పార్టీ పోరాటం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు.ఈ విలేకరుల సమావేశంలో కొత్తపెళ్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరు హరీష్, కొత్తపల్లి బీజేపీ మండల అధ్యక్షులు కుంట తిరుపతి , ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, ఓబీసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచకొండ కొమురయ్య ,జిల్లా నాయకులు జిట్టవేణీ రేణు, శ్రీనివాస్ నాయక్,బుస అనిల్ కుమార్,దాసరి రవి, లుక్క విజయ్ తదితరులు పాల్గొన్నారు.