గిఫ్ట్ గార్డెన్ ప్రారంభించిన విష్ణు రెడ్డి

01-10-2026 | 10:13pm

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నక్కలగుట్ట నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ గార్డెన్(Gift Garden)ను గురువారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy)  అల్లుడు విష్ణు రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి,కస్టమర్లకు అందుబాటు ధరలలో నాణ్యమైన బహుమతులను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి,స్థానిక డివిజన్ అధ్యక్షులు కరీం, నాయకులు కొండా నాగరాజు ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు