గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన..
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్(Greater Warangal Press Club) భవనం పక్కన గల ఖాళీ స్థలంలో నూతన భవన నిర్మాణానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ లు శంకుస్థాపన చేశారు. ఉదయం 8 గంటలకు పురోహితుల వేదమంత్రోఛ్చారణల మద్య పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యులు యంసాని శ్రీనివాస్, వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్థన్, వీరగోని హరీష్, జనగాని అంజనేయులు, ఎండీ నయీంపాషా, కందుకూరి సంజీవ్, టీయూడ్బ్లూజే హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం కేశవమూర్తి, ఉట్కూరు సాయిరాం, నేతలు వల్లాల వెంకటరమణ, రామాచారి, శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.