ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి శ్రీరాముడి బాణం బహూకరణ
21-10-2026 | 07:30pm
హనుమకొండ (విజయక్రాంతి): విజయదశమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy)కి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ శ్రీరాముడి బాణాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా విజయదశమి కార్యక్రమం జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజయదశమి ఉత్సవ సమితి అధ్యక్షుడు రావుల సుదర్శన్, మాజీ శాసన సభ్యులు ధర్మారావు, ఎనుగుల రాకేష్ రెడ్డి, విద్యాసాగర్, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.