ఎల్ నినోపై స్వల్పకాలిక చర్చ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ఎల్ నినోపై స్వల్పకాలిక చర్చను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రారంభించారు. రాష్ట్రంలో ఎల్ నినో(El Nino) ప్రభావం తీవ్రంగా ఉందని, అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు(Farmers) ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో ఎల్ నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై ఉందని ఉత్తమ్ తెలిపారు. ఎల్ నినో సమయంలో కరువు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఎల్ నినో గురించి తెలియగానే రైతులను హెచ్చరించి, ఏ పంటలు వేస్తే బాగుంటుందో తెలియజేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 153 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయని, ఈ ఏడాది కేవలం 61 టీఎంసీలు, నాగార్జునసాగర్ లో గతేడాది 174 టీఎంసీలు ఉంటే ఇప్పడు 44 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. శ్రీరామ్ సాగర్ లో గతేడాదితో పోలీస్తే 34 టీఎంసీలు తక్కువగా ఉందన్నారు.