5 September, 2026 | 4:54 AM

పొంగులేటి జాగ్రత్తగా మాట్లాడాలి.. తాట తీస్తాం

04-09-2026 | 02:02pm

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా

హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై(Minister Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పొంగులేటి జాగ్రత్తగా మాట్లాడాలి.. తాట తీస్తామని హెచ్చరించారు.

 బీఆర్ఎస్(Minister Ponguleti Srinivasa Reddy) కంటే ఏ పని మీరు ఎక్కువ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) స్పష్టం చేశారు. వట్టినాగులపల్లిలో(Vattinagulapalli) రూ. 2 వేల కోట్ల భూమిని పొంగులేటి దోచుకోవాలని చూశారని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రకాల్చి వాత పెడతామన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, పాలేరులో పొంగులేటి గెలవరని జోస్యం చెప్పారు. ఇద్దరు సింగిల్ డిపాజిట్ కే పరిమితమని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు.కాగా, అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ రెడ్డి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఆదేశిస్తూ శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

మరిన్ని వార్తలు