ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు మాయం..

25-11-2026 | 06:47pm

-ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా

మల్లాపూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) కోటా కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు మాయమయ్యాయని ఆరోపిస్తూ మల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు మాయమవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే సంబంధిత పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.పేదల సొంతింటి కలను సాకారం చేసే ఇళ్ల విషయంలో రాజకీయాలు చేయవద్దని, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు