మాల్తుమ్మెదలో 35 ఎకరాల భూసర్వే

25-11-2026 | 06:46pm

నాగిరెడ్డిపేట్, నవంబర్ 25 (విజయ క్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో 834, 835 సర్వే నెంబర్ల పరిధిలో అధికారులు భూసర్వే (Land Survey) నిర్వహించారు. బుధవారం సుమారు 35 ఎకరాల భూమిని సర్వే (Survey) చేసినట్లు ఎమ్మార్వో వెంకట్ రెడ్డి తెలిపారు.

పట్టా పాస్‌బుక్కుల (Passbooks) కోసం వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ సర్వే చేపట్టినట్లు వివరించారు. సర్వే పూర్తయిన అనంతరం నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తామని, వారి పరిశీలన తర్వాత అర్హులైన రైతులకు పట్టా పాస్‌బుక్కులు (Patta Passbooks) అందజేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, ఎమ్మార్వో వెంకట్ రెడ్డి, ఆర్ఐ అజయ్ కుమార్, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు