లారీ - బైక్ ఢీ..
16-10-2026 | 03:15pm
జనగామ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రఘునాథపల్లి హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై(Warangal National Highway) రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.