వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

16-10-2026 | 04:10pm
  1. విధుల్లో నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేదే లేదు..
  2. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  వైద్యాధికారి డాక్టర్ సాధన...

ఉట్నూర్, అక్టోబర్ 16( విజయక్రాంతి ): ఏజెన్సీ ప్రాంతంలో  వైద్య శాఖలో  విధులు నిర్వహించే  వైద్య సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాల్లో అప్రమత్తంగా ఉండి  వైద్య సేవలు అందించాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ(Department of Medical and Health) జిల్లా వైద్యాధికారి ( డి ఎం ఎం హెచ్ ఓ ) డాక్టర్ సాధన అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిఎంహెచ్ఓ  వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  అదనపు జిల్లా అధికారి  డాక్టర్ కుడిమేత  మనోహర్, డాక్టర్ పూజిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు