మంత్రి పొంగులేటికి నిరసన సెగ

26-09-2026 | 10:59pm

 ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి మహిళల ఆందోళన

జనగామ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) కేంద్రంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి ప్రసంగిస్తుండగా కొంతమంది మహిళలు ఇందిరమ్మ చీరలు(Womens Indiramma sarees) కట్టుకొని వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రూ.4000 పింఛన్(Pension) ఎక్కడ?, రూ.500 కే గ్యాస్ సిలిండర్(Gas cylinder) ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు, దొంగ హామీలు ఇస్తున్నారు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు, కాంగ్రెస్ నాయకులు వారిని శాంతింపజేసి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

మరిన్ని వార్తలు