రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
30-10-2026 | 03:18pm
జనగామ,(రఘునాథపల్లి), అక్టోబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి సమీపంలో(Near Govardhanagiri) శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం రెండు వాహనాలు అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తీవ్ర గాయాలతో ఒకరు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.