ఎల్ నినోతో అప్రమత్తంగా ఉండాలి

12-10-2026 | 09:58pm

- రైతులకు సీఎం సందేశం వీక్షణ

తరిగొప్పుల,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) ఎల్ నినో ప్రభావంపై రైతులకు ఇచ్చిన సందేశాన్ని సోమవారం తరిగొప్పుల మండలం(Tarigoppula mandal) అబ్దుల్ నాగారం గ్రామ రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ఏఈఓ వినయ్ కుమార్ పాల్గొని రైతులకు ఎల్ నినో ప్రభావం(El Nino Impact) తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు(Crop Cultivation), నీటి పొదుపు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కావటి సుధాకర్, ఉప సర్పంచ్ నీల సంపత్, నర్సాపూర్ సర్పంచ్ కొండ్ర తార, ఉప సర్పంచ్ ఎర్రం మహేష్, పంచాయతీ కార్యదర్శులు భూక్య లింగం, శ్రావణి, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు