ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు తీయాలి

12-10-2026 | 11:01pm

రామగిరి,(విజయ క్రాంతి): ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు తీయాలి అని లొంగకేసారం మాజీ సర్పంచ్ ఎండి మంజూర్ అన్నారు. సోమవారం రామగిరి మండలంలోని లొంగకేసారం శివారులో గల ఎండి మంజూరు యొక్క ఫామ్ హౌస్ లో హెల్పింగ్ నేచర్ అనే లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం  కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంజూర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులను ప్రోత్సహించాలని కొత్తదనం ఉన్న లఘు చిత్రాలను తీసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని పేర్కొన్నారు. ఇటువంటి లఘు చిత్రాల కోసం తాను సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పులిపాక దేవా దర్శకత్వంలో చిత్రం రూపొందించడం జరుగుతుంది. ఈ చిత్రంలో సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్, పద్మలత,మడిపోజు మానస, మ్యాజిక్ శశి, ప్రశాంత్, మధునయ్య, అంజలి, సతీష్, సునీల్ కంక, కెమెరామెన్ కందుల వెంకటేష్, పిట్టల సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు