పోషకాహారంపై అవగాహన
10-09-2026 | 01:28pm
గణపురం, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): పోషణ మాసం( Nutrition Month) సందర్భంగా గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని మదనపల్లి అంగన్వాడి కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన(Awareness) కల్పించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోషకాహార వంటకాలను ప్రదర్శించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు అరుణ, అంగన్వాడీ టీచర్ ఏ. దివ్య, హెల్పర్ పీ. మమత, ఆశా కార్యకర్త ఎన్. మమతతో పాటు చిన్నారులు, వారి తల్లులు పాల్గొన్నారు.