బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు

10-09-2026 | 02:54pm

దళితులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ శ్రేణులు...

ఉట్నూర్, సెప్టెంబర్ 10( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ఆదేశాల మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో(Utnoor Police Station) కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గురువారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్  పైన్ బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాక్యాలకు నిరసనగ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్దకు దళితులు వచ్చారని, వారు వచ్చిన ప్రదేశాలను పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలని కేసీఆర్ ఆదేశాలతో శుద్ధి చేశారు. దళితులను అవమానించేలా మాట్లాడిన బిఆర్ఎస్ మహిళా నాయకురాలు(BRS woman leader)  పావని గౌడ్, సంధ్యారావు లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసండ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై SC. ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దళితుల గౌరవం, హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ నిసార్,జిల్లా ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, జైనూర్  మార్కెట్ వైస్ చైర్మెన్ జైవంత్,ఎస్సీ సెల్ నాయకులు లాజర్,మహేందర్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్,ఉట్నూర్ కాంగ్రెస్ నాయకులు కలిమ్,శ్రీనివాస్,ఆన్సర్ అలీ, ఫహీమ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు