జిల్లా కలెక్టర్ ను కలిసిన సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

06-11-2026 | 07:13pm

భూపాలపల్లి టౌన్, నవంబర్ 06 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)ను శుక్రవారం సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకముగా కలిసారు. ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, జీవితంలో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్స్ ఆఫీసర్ బాబుల్ రాజ్, కార్తీక్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు