నూతన ఎస్ఈ శివమోహన్ ను కలిసిన నాయకులు
01-10-2026 | 05:48pm
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 01 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్(Telangana State Power Employees Union) జి 445 బీఎంఎస్ రీజనల్ అధ్యక్షులు కొండా శ్రీనివాస్ అద్వర్యంలో నూతన ఎస్ఈ శివమోహన్ ను మర్యాదపూర్వకముగా కలిసారు. ఈ సందర్భంగా శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా బీఎంఎస్ రీజనల్ అధ్యక్షులు కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కోల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, సభ్యులు, తోట సురేష్, స్వప్న, అల్గం అనిల్, పుల్లారావు, జితేందర్, శ్రీనివాస్, తిరుపతి, సీతారాములు పాల్గొన్నారు.